HYDRA: హైదరాబాద్‌లో అనుమతులు లేని హోర్డింగులను తొలగిస్తున్న హైడ్రా

Hydra removing hordings in Hyderabad
  • శంషాబాద్, తెల్లాపూర్ సహా పలు ప్రాంతాల్లో అక్రమ హోర్డింగుల తొలగింపు
  • ఇప్పటి వరకు 53 భారీ హోర్డింగులను తొలగించిన హైడ్రా
  • కోమటికుంట చెరువులోని అక్రమ నిర్మాణాల కూల్చివేత
హైదరాబాద్ నగరంలో అనుమతులు లేని హోర్డింగులపై హైడ్రా ప్రత్యేక దృష్టి సారించింది. చెరువులు, ప్రభుత్వ భూముల ఆక్రమణలను అడ్డుకోవడంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తోన్న ఈ సంస్థ, నగరంలో అక్రమంగా వెలిసిన హోర్డింగుల తొలగింపునకు నడుం బిగించింది.

హైదరాబాద్ శివారు ప్రాంతాలైన శంషాబాద్, కొత్వాల్‌గూడ, నార్సింగి, తొండుపల్లి, గొల్లపల్లి రోడ్డు, తెల్లాపూర్ తదితర ప్రాంతాల్లో ఇప్పటివరకు 53 భారీ హోర్డింగులను హైడ్రా సిబ్బంది తొలగించింది. ఈ సందర్భంగా యాడ్ ఏజెన్సీల ప్రతినిధులతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమావేశమై, అనుమతులు లేని హోర్డింగులను తొలగిస్తామని స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా, మేడ్చల్ జిల్లాలోని కోమటికుంట చెరువులో చేపట్టిన అక్రమ నిర్మాణాలను హైడ్రా సిబ్బంది కూల్చివేసింది.
HYDRA
Telangana
Hyderabad

More Telugu News