Orange: వాలంటైన్స్ డే స్పెష‌ల్‌.. రేపు థియేట‌ర్ల‌లోకి 'ఆరెంజ్' మూవీ

Ram Charans Orange to re release on February 14

  • ప్రేమికుల రోజు సంద‌ర్భంగా రేపు 'ఆరెంజ్' రీ రిలీజ్
  • చరణ్‌, జెనీలియా హీరోహీరోయిన్లు.. 'బొమ్మరిల్లు' భాస్కర్ డైరెక్ట‌ర్‌
  • బాక్సాఫీసు వద్ద ఆశించిన విజయం సాధించలేక‌పోయిన మూవీ
  • ఆ తర్వాత కల్ట్ క్లాసిక్ స్టేటస్ అందుకున్న వైనం

వాలంటైన్స్ డే స్పెష‌ల్ గా గ్లోబ‌ల్ స్టార్‌ రామ్ చరణ్ న‌టించిన‌ రొమాంటిక్‌ సినిమా 'ఆరెంజ్‌' రీ రిలీజ్‌కు రెడీ అయింది. రేపు ప్రేమికుల రోజు సంద‌ర్భంగా ఈ మూవీ థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌బోతోంది. 'బొమ్మరిల్లు' భాస్కర్‌ దర్శకత్వంలో రామ్‌ చరణ్‌, జెనీలియా హీరోహీరోయిన్లుగా 'ఆరెంజ్‌' సినిమా తెరకెక్కింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కానీ ఈ సినిమా అప్పటి యూత్‌, మెగా ఫ్యాన్స్‌కి ప్రత్యేకమనే చెప్పాలి. 

అసలు ప్రేమ ఎంతకాలం ఉంటుందనే నిజాన్ని 'ఆరెంజ్‌'తో తెలియజేశాడు ద‌ర్శ‌కుడు. 2010 నవంబర్‌ 26న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఆశించిన విజయం సాధించలేదు. అయితే ఆ తర్వాత కల్ట్ క్లాసిక్ స్టేటస్ అందుకుంది. ఇందులో లవర్ బాయ్ గా చరణ్‌ నటనకు మంచి మార్కులు పడ్డాయి. జీవితాంతం ప్రేమ అనేది అబద్ధం, కొంత‌కాలం మాత్ర‌మే ప్రేమ బాగుంటుందనే సరికొత్త కాన్సెప్ట్ తో ద‌ర్శ‌కుడు భాస్కర్ చిత్రాన్ని తెరకెక్కించాడు.

ప్రేమ ఎప్పుడు ఒకేలా ఉండదు అనే నిజాన్ని ఈ సినిమా ద్వారా చూపించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్‌. ముఖ్యంగా పాటలతో సంగీత ప్రియులను అలరించిన 'ఆరెంజ్‌' మూవీ వాలంటైన్స్ డే సందర్భంగా మరోసారి ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. 2023లో ఈ సినిమా రీ రిలీజ్‌ అవ్వగా దీనికి మంచి స్పంద‌న‌ వచ్చింది. మ‌రి ఇప్పుడు ఎలాంటి రెస్పాన్స్ వ‌స్తుందో చూడాలి. ఇప్ప‌టికే మేక‌ర్స్ రీ రిలీజ్ ట్రైల‌ర్ ను కూడా విడుద‌ల చేశారు. 

Orange
Ramcharan
Tollywood
  • Loading...

More Telugu News