హైదరాబాద్‌లో వల్లభనేని వంశీ అరెస్ట్.. విజయవాడ తరలిస్తున్న పోలీసులు
- 2023 ఫిబ్రవరి 20న గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి
- వంశీ సహా 88 మందిని నిందితులుగా చేర్చిన పోలీసులు
- ఇదే కేసులో వంశీని అరెస్ట్ చేసినట్టు సమాచారం
గన్నవరం టీడీపీ కార్యాలయంపై 2023 ఫిబ్రవరి 20న దాడి జరిగింది. ఈ కేసులో వంశీ సహా 88 మంది నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా పోలీసులను ఆదేశించాలంటూ కోర్టులో వంశీ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ నెల 20న విచారణ జరగనుంది. అంతలోనే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకోవడం గమనార్హం.