Telangana: తెలంగాణ సచివాలయంలో ఆరో అంతస్తు నుండి ఊడిపడిన పెచ్చులు

Part of plaster collapses from Telangana Secretariat

  • రామగుండం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కారుపై పడిన పెచ్చులు
  • పెచ్చులు ఊడిపడిన సమయంలో ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం
  • ఆరో అంతస్తులోనే సీఎంవో, సీఎస్ కార్యాలయాలు

తెలంగాణ రాష్ట్ర సచివాలయ భవనంలో పెచ్చులు ఊడిపడి ఒక కారు ధ్వంసమైంది. కాసేపటి క్రితం సచివాలయ భవనంలోని ఆరో అంతస్తు నుండి పెచ్చులు ఊడిపడి పార్కింగ్‌లో ఉన్న రామగుండం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కారుపై పడ్డాయి. ఈ ఘటనలో కారు స్వల్పంగా ధ్వంసమైంది.

పెచ్చులు ఊడిపడిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. సచివాలయంలోని ఆరో అంతస్తులోనే ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయాలు ఉన్నాయి. కొత్తగా నిర్మించిన సచివాలయ భవనం నుండి పెచ్చులు ఊడిపడటం చర్చనీయాంశంగా మారింది.

Telangana
Secretariat
Hyderabad
  • Loading...

More Telugu News