Cellphone Blast: మహిళ ప్యాంట్ జేబులో పేలిన సెల్ ఫోన్... వీడియో ఇదిగో!

Cellphone blasts in woman back packet while shopping

 


కొన్నిసార్లు సెల్ ఫోన్లు కూడా పేలతాయన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఛార్జింగ్ సమయంలో ఫోన్లు పేలిన ఘటనలు చూశాం. అయితే, బ్రెజిల్ లో ఓ మహిళ ప్యాంటు జేబులో సెల్ ఫోన్ పేలిపోయిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఆ మహిళ భర్తతో కలిసి సూపర్ మార్కెట్ లో షాపింగ్ చేస్తోంది. ఆ సమయంలో సెల్ ఫోన్ ను బ్యాక్ పాకెట్ లో పెట్టుకుంది. ఒక్కసారిగా ఫోన్ పేలడంతో మంటలు వచ్చాయి. ఈ ప్రమాదంలో ఆమె నడుము భాగానికి, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. సూపర్ మార్కెట్లోని సీసీటీవీ కెమెరాల్లో ఈ ఘటన రికార్డయింది.

Cellphone Blast
Woman
Brazil
Viral Video
  • Loading...

More Telugu News