Vishwak Sen: ప్రతిసారి తగ్గను.. నన్ను రాజకీయాల్లోకి లాగొద్దు: విష్వక్సేన్

Dont drag me into politics says Vishwak Sen
  • 'లైలా' ప్రీరిలీజ్ ఈవెంట్ లో పృథ్వీ వ్యాఖ్యలు వివాదాస్పదం
  • ఇప్పటికే క్షమాపణ చెప్పిన విష్వక్సేన్ 
  • అయినా తగ్గని 'బాయ్ కాట్ లైలా' ట్రెండ్
  • ఎక్కువగా ఆలోచించవద్దన్న విష్వక్సేన్ 
'లైలా' ప్రీరిలీజ్ ఈవెంట్ లో కమెడియన్ పృథ్వీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. వైసీపీని టార్గెట్ చేసేలా పరోక్షంగా ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా హీరో విష్వక్సేన్, చిత్ర నిర్మాత సాహు గారపాటి స్పందిస్తూ అలా జరిగినందుకు క్షమాపణ చెప్పారు. అయినా సోషల్ మీడియాలో 'బాయ్ కాట్ లైలా' హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తుండటంతో విష్వక్సేన్ మారోసారి స్పందించారు. 

'నేను ప్రతిసారి తగ్గను. ప్రీరిలీజ్ ఈవెంట్ లో జరిగిన దానికి క్షమాపణలు చెప్పాను. ఎక్కువగా ఆలోచించవద్దు. ప్రశాంతంగా ఉండండి. మళ్లీ చెపుతున్నా. నేను నటుడిని మాత్రమే. నన్ను, నా సినిమాను రాజకీయాల్లోకి లాగొద్దు' అని విష్వక్సేన్ ట్వీట్ చేశారు.
Vishwak Sen
Tollywood

More Telugu News