Chiranjeevi: మా తాత రసికుడు: చిరంజీవి వ్యాఖ్యలు వైరల్

Chiranjeevi comments on his grand father

  • 'బ్రహ్మ ఆనందం' ప్రీరిలీజ్ ఫంక్షన్ లో చిరంజీవి సరదా వ్యాఖ్యలు
  • తాత గురించి మాట్లాడాలన్న యాంకర్ సుమ
  • తనకు ఇద్దరు అమ్మమ్మలని చెప్పిన చిరంజీవి

సరదా కామెంట్లు చేయడంలో మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ ముందుంటారు. నిజ జీవితంలో కూడా ఆయన ఎంతో సరదాగా ఉంటారు. తాజాగా ఆయన మరోసారి అందరినీ కడుపుబ్బ నవ్వించారు. బ్రహ్మానందం, ఆయన కుమారుడు గౌతమ్ కలిసి నటించిన 'బ్రహ్మ ఆనందం' ప్రీరిలీజ్ ఫంక్షన్ కార్యక్రమానికి చిరంజీవి హాజరయ్యారు. 

ఈ ఫంక్షన్ లో తాత గురించి మాట్లాడాలని చిరంజీవిని యాంకర్ సుమ అడిగారు. దీంతో ఆయన మాట్లాడుతూ... నీకు ఎవరి బుద్ధులు వచ్చినా పర్వేదు కానీ, మీ తాత బుద్ధులు మాత్రం రాకూడదని మా అమ్మ తరచూ చెప్పేదని తెలిపారు. ఎందుకంటే తమ తాత మహా రసికుడని, తనకు ఇద్దరు అమ్మమ్మలని సరదాగా చెప్పారు. 

Chiranjeevi
Tollywood
  • Loading...

More Telugu News