Konda Surekha: శివరాత్రి పండుగ నేపథ్యంలో అధికారులతో కొండా సురేఖ సమీక్ష

Konda Surekha review on Shiv Rathri

  • సచివాలయంలో దేవాదాయ శాఖ అధికారులతో సమీక్ష
  • భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు ఆదేశం
  • వేములవాడతో పాటు అన్ని దేవస్థానాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలన్న మంత్రి

మహాశివరాత్రి పండుగ నేపథ్యంలో తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సచివాలయంలో ఆ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. శివరాత్రి పండుగ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని శైవ క్షేత్రాల్లో పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఫిబ్రవరి 25 నుండి 27వ తేదీ వరకు మూడు రోజుల పాటు మహా శివరాత్రి వేడుకలు జరగనున్నాయని ఆమె అన్నారు.

వేములవాడ, కాళేశ్వరం, కీసర, ఏడుపాయలు, రామప్ప, మేళ్ల చెరువు, పానగళ్లు, పాలకుర్తి, వెయ్యిస్థంభాల గుడి, మెట్టుగుట్ట దేవాలయం, కాశీబుగ్గ శివాలయం, భద్రకాళి గుడి తదితర దేవస్థానాల్లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని, ఆయా దేవస్థానాల్లో అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆమె అన్నారు.

Konda Surekha
Telangana
Shivaratri
  • Loading...

More Telugu News