Daggubati Purandeswari: విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల సమస్యలపై కేంద్రమంత్రితో చర్చించా: పురందేశ్వరి

Purandeswari met union minister Kumaraswamy

  • ఢిల్లీలో కేంద్రమంత్రి కుమారస్వామితో పురందేశ్వరి భేటీ
  • స్టీల్ ప్లాంట్ అంశం ప్రస్తావించానని వెల్లడి
  • ప్లాంట్ ఉద్యోగులకు ప్రతి నెల జీతాలు అందేలా చూస్తానని హామీ ఇచ్చారని వివరణ

రాజమండ్రి ఎంపీ, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి నేడు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామితో భేటీ అయ్యారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల సమస్యలపై కేంద్ర మంత్రితో చర్చించానని వెల్లడించారు. ఉద్యోగులకు ప్రతి నెల జీతాలు అందేలా చూస్తానని కేంద్రమంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. ఈ భేటీలో కేంద్ర సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ కూడా పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా పురందేశ్వరి... కుమారస్వామికి వినతి పత్రం కూడా సమర్పించారు. ఈ భేటీకి సంబంధించిన వివరాలు, ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు.

Daggubati Purandeswari
Kumaraswamy
Vizag Steel Plant
BJP
  • Loading...

More Telugu News