Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఫ్రాన్స్, అమెరికా పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ

PM Modi left to France
Advertisement
  • ఫ్రాన్స్ లో జరిగే ఏఐ యాక్షన్ సమ్మిట్లో పాల్గొంటున్నానని మోదీ ట్వీట్
  • సంబంధాలను బలోపేతం చేసుకునే దిశగా మాక్రాన్ తో చర్చలు జరపనున్నట్టు వెల్లడి
  • మార్సిల్లేలో కాన్సులేట్ ప్రారంభించనున్నామన్న ప్రధాని
Advertisement
ప్రధాన మోదీ విదేశీ పర్యటనకు బయల్దేరారు. ఫ్రాన్స్, అమెరికా దేశాల్లో ఆయన పర్యటన కొనసాగనుంది. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ... వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రాబోయే కొన్ని రోజులు తాను ఫ్రాన్స్, అమెరికాలో ఉంటానని చెప్పారు. 

ఫ్రాన్స్ లో జరిగే ఏఐ యాక్షన్ సమ్మిట్లో పాల్గొంటానని పేర్కొన్నారు. ఇండియా-ఫ్రాన్స్ సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ తో చర్చలు జరుపుతానని వెల్లడించారు. మార్సిల్లేలో కాన్సులేట్ ను కూడా ప్రారంభించనున్నట్టు కూడా తెలిపారు.
Advertisement
Advertisement
Narendra Modi
BJP
France
USA

More Telugu News