Narendra Modi: విజయోత్సవాల కోసం బీజేపీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న ప్రధాని మోదీ

PM Modi arrives BJP Head Quarters in Delhi
  • ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం
  • ఆప్ పాలనకు చరమగీతం పాడిన కాషాయదళం
  • బీజేపీ కేంద్ర కార్యాలయం వద్ద మోదీకి ఘనస్వాగతం
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చారిత్రాత్మక విజయం అందుకుంది. ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలు ఉండగా... బీజేపీ 47 స్థానాల్లో గెలిచి 1 స్థానంలో ఆధిక్యంలో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ 22 స్థానాలకు పరిమితమైంది. ఈ నేపథ్యంలో, ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయం వద్ద సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. 

ఈ విజయోత్సవాల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితమే బీజేపీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడికి చేరుకున్న వేలాది బీజేపీ కార్యకర్తలు, నేతలు ప్రధాని మోదీకి ఘనస్వాగతం పలికారు. మోదీ వెంట కేంద్రమంత్రులు, బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డా కూడా వచ్చారు. ప్రధాని మోదీని గజమాలతో సత్కరించారు. 

ఇక, ఈ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ అభ్యర్థులను మోదీ అభినందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కార్యకర్తలు మోదీ నినాదాలతో హోరెత్తించారు.
Narendra Modi
BJP
Delhi Assembly Elections

More Telugu News