Nikhil: మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో ఉన్న ప్రైవేట్ వీడియోలపై హీరో నిఖిల్ స్పందన

Actor Nikhil response on private videos in Mastan Sai hard drive

  • మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ ను పోలీసులకు ఇచ్చిన లావణ్య
  • హార్డ్ డిస్క్ లో వందల మంది అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు
  • ఆ వీడియోలో ఉన్నది తన కుటుంబ సభ్యులేనని చెప్పిన నిఖిల్

రాజ్ తరుణ్ భార్య అని చెప్పుకుంటున్న లావణ్య... మస్తాన్ సాయి అనే వ్యక్తి హార్డ్ డిస్క్ ఒకదాన్ని పోలీసులకు అందించిన సంగతి తెలిసిందే. ఆ హార్డ్ డిస్క్ లో వందల మంది అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు, ఫొటోలు ఉన్నాయి. మస్తాన్ సాయి మీద ఫిర్యాదు చేస్తున్న సమయంలో ఆమె మాట్లాడుతూ... హీరో నిఖిల్ ప్రైవేట్ వీడియోలు కూడా అందులో ఉన్నాయని తెలిపింది. ఈ విషయం సంచలనంగా మారింది. 

ఈ అంశంపై నిఖిల్ క్లారిటీ ఇచ్చారు. తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆయన అన్నారు. తన కుటుంబ సభ్యులతో ఉన్న వీడియోలను తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అవి 'కార్తికేయ 2' సక్సెస్ మీట్ తర్వాత జరిగిన డిన్నర్ పార్టీలోని వీడియోలు అని తెలిపారు. వీడియోలో ఉన్నది తన కుటుంబ సభ్యులేనని చెప్పారు. వాస్తవం ఏమిటనేది పోలీసులకు కూడా తెలుసని అన్నారు. 

Nikhil
Tollywood
Mastan Sai
  • Loading...

More Telugu News