YS Jagan: జగన్ నివాసం వద్ద మహిళ బైఠాయింపు

Woman sits before YS Jagan Tadepalli house
  • మొన్న తాడేపల్లి చేరుకున్న అద్దంకికి చెందిన మహిళ
  • జగన్‌తో ఫొటో దిగకుండా వెళ్లేది లేదన్న వైనం
  • ఫొటో దిగాక అప్పులు తీర్చేందుకు డబ్బులు కావాలని డిమాండ్
  • ప్రశ్నించి వదిలిపెట్టిన పోలీసులు
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాసం ఎదుట ఓ మహిళ హల్‌‌చల్ చేసింది. పోలీసుల కథనం ప్రకారం.. అద్దంకికి చెందిన సిద్ధారపు అంజమరెడ్డి ఈ నెల 6న జగన్‌ను కలిసేందుకు తాడేపల్లిలోని ఆయన నివాసానికి చేరుకుంది. ఆయనతో కలిసి ఫొటో దిగకుండా వెళ్లేది లేదని పట్టుబట్టడంతో వైసీపీ గ్రీవెన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు నాగ నారాయణమూర్తి నిన్న ఆమెను లోపలికి తీసుకెళ్లి జగన్‌తో ఫొటో తీయించారు.

అనంతరం బయటకు వెళ్తూ తనకు అప్పులున్నాయని, సాయం చేయాలని కోరింది. ఆ తర్వాత బయటకు వచ్చి గేటుకు అడ్డంగా కూర్చొంది. దీంతో అక్కడి సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వారొచ్చి ఆమెను స్టేషన్‌కు తరలించారు. వివరాలు సేకరించిన అనంతరం ఆమెను విడిచిపెట్టినట్టు పోలీసులు తెలిపారు.
YS Jagan
Tadeaplli
YSRCP

More Telugu News