Gadapa Gadapaku Mana Prabhutvam: 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమాన్ని రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం

AP Govt cancells Gadapa Gadapaku Mana Prabhutvam programme
షార్ట్స్‌లో చూడండి
ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో కార్యక్రమాన్ని రద్దు చేసింది. 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమాన్ని నిలిపివేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రణాళికా విభాగం ముఖ్య కార్యదర్శి పియూష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కార్యక్రమాన్ని తక్షణమే నిలిపివేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. తొలుత ఈ కార్యక్రమాన్ని పార్టీ కార్యక్రమంగా తీసుకొచ్చారు. ఆ తర్వాత ప్రభుత్వ కార్యక్రమంగా మార్చారు. ఎన్నికలకు ఏడాది ముందు జగన్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడు నెలల అనంతరం ఈ కార్యక్రమాన్ని ఆపివేశారు.
Go Back to Shorts
Gadapa Gadapaku Mana Prabhutvam
Andhra Pradesh

More Telugu News