TG TET Result 2025: తెలంగాణ‌ టెట్ ఫ‌లితాలు రిలీజ్‌

Telangana TET Result 2025 Released
  • ఈ ఏడాది జ‌న‌వ‌రి 2 నుంచి 20 వ‌ర‌కు టెట్ ప‌రీక్ష‌లు 
  • ఫ‌లితాల‌ను విడుద‌ల చేసిన విద్యాశాఖ కార్య‌ద‌ర్శి యోగిత
  • ఈ ఎగ్జామ్స్ కు 1,35,802 మంది హాజ‌రు
  • వీరిలో 42,384 (31.21 శాతం) మంది అర్హ‌త సాధించిన‌ట్లు అధికారుల వెల్ల‌డి
తెలంగాణ‌ టెట్ ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. విద్యాశాఖ కార్య‌ద‌ర్శి యోగిత ఫ‌లితాల‌ను విడుద‌ల చేశారు. ఈ ఏడాది జ‌న‌వ‌రి 2 నుంచి 20 వ‌ర‌కు టెట్ ప‌రీక్ష‌లు జ‌రిగాయి. ఈ ఎగ్జామ్స్ కు 1,35,802 మంది హాజ‌ర‌య్యారు. వీరిలో 42,384 (31.21 శాతం) మంది అర్హ‌త సాధించిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. 

కాగా, తెలంగాణ‌ టెట్‌ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. 1 నుంచి 5 తరగతులకు ఉపాధ్యాయులుగా ఉండాలనుకునే అభ్యర్థులు పేపర్-1ని... 6 నుంచి 8 తరగతులకు ఉపాధ్యాయులుగా ఉండాలనుకునే వారు పేపర్-2ను ఎంపిక చేసుకుంటారు. 

ఇక టీచ‌ర్‌ ఉద్యోగాల భర్తీ సయమంలో టెట్‌లో సాధించిన మార్కులను పరిగణలోకి తీసుకుంటార‌నే విష‌యం తెలిసిందే. ఇకపై ప్రతి సంవత్సరం టెట్‌ను నిర్వహిస్తామని తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రకటించింది.
TG TET Result 2025
Telangana

More Telugu News