Abhishek Sharma: టీ20 ర్యాంకింగ్స్ లో దూసుకెళ్లిన అభిషేక్ శర్మ.. వరుణ్ చ‌క్ర‌వ‌ర్తికి కెరీర్ బెస్ట్ ర్యాంక్‌

ICC T20 Rankings Abhishek Sharma Jumps to Second Spot after England Heroics
  • ఏకంగా 38 స్థానాలు ఎగబాకి రెండో స్థానానికి చేరుకున్న అభిషేక్‌
  • తిలక్ వర్మకు మూడో స్థానం... సూర్యకుమార్ కు ఐదో ర్యాంక్‌
  • బౌలింగ్ విభాగంలో వరుణ్‌ చక్రవర్తికి మూడో ర్యాంక్
తాజాగా విడుదల చేసిన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో టీమిండియా యువ ఓపెన‌ర్‌ అభిషేక్ శర్మ దూసుకెళ్లాడు. ఇంగ్లండ్‌పై ఐదో టీ20లో 37 బంతుల్లోనే శ‌త‌కం న‌మోదు చేసిన యువ బ్యాట‌ర్‌.. ఈ రికార్డు బ్రేకింగ్ సెంచరీతో ఏకంగా రెండో ర్యాంక్ ద‌క్కించుకున్నాడు. ఏకంగా 38 స్థానాలు ఎగబాకి రెండో స్థానానికి చేరుకున్నాడు. అటు ఆస్ట్రేలియా స్టార్ ట్రావిస్ హెడ్ తన అగ్రస్థానాన్ని ప‌దిలం చేసుకున్నాడు. అభిషేక్ కేవలం బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లోనే కాదు ఆల్ రౌండర్ విభాగంలోనూ 31 స్థానాలు ఎగబాకి 13వ ర్యాంకుకు చేరుకోవ‌డం విశేషం.

బ్యాటింగ్ విభాగంలో టాప్ -5లో అభిషేక్ శర్మతో పాటు మరో ఇద్దరు టీమిండియా ఆట‌గాళ్లు కూడా చోటు ద‌క్కించుకున్నారు. తిలక్ వర్మ మూడో స్థానంలో ఉంటే... భార‌త జ‌ట్టు టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఐదో స్థానంలో కొన‌సాగుతున్నాడు. అటు హార్దిక్ పాండ్య ఐదు స్థానాలు ఎగబాకి 51వ ర్యాంకుకు చేరుకోగా, శివమ్ దూబె ఏకంగా 38 స్థానాలను మెరుగుప‌ర‌చుకుని 58వ ర్యాంక్ ద‌క్కించుకున్నాడు.

వరుణ్ చ‌క్ర‌వ‌ర్తికి కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ 
ఇంగ్లండ్‌పై ప్లేయర్ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచిన వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్ విభాగంలో కెరీర్ బెస్ట్ ర్యాంక్ సాధించాడు. మూడు స్థానాలు ఎగబాకి మూడో ర్యాంక్‌కు చేరుకున్నాడు. వెస్టిండీస్ బౌలర్ అకీల్ హుసేన్ అగ్ర‌స్థానంలో ఉంటే.. అదిల్ రషీద్ రెండో ర్యాంక్ లో కొన‌సాగుతున్నాడు. టీమిండియా మ‌రో స్పిన్న‌ర్ రవి బిష్ణోయ్ నాలుగు స్థానాలు మెరుగుపరచుకుని ఆరో ర్యాంక్ ద‌క్కించుకున్నాడు.
Abhishek Sharma
ICC T20 Rankings
Team India
Cricket
Sports News

More Telugu News