Pushpalatha: అలనాటి సినీ నటి పుష్పలత కన్నుమూత

Senior actress Pushpalatha passes away
  • నిన్న రాత్రి చెన్నైలో తుదిశ్వాస విడిచిన పుష్పలత
  • 100కు పైగా సినిమాల్లో నటించిన ఘనత
  • ఎన్టీఆర్ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన పుష్పలత
సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. అలనాటి నటి పుష్పలత కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. 87 ఏళ్ల పుష్పలత నిన్న రాత్రి చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. 

తమిళనాడులోని కోయంబత్తూర్ సమీపంలోని మెట్టుపాళ్యంకు చెందిన ఆమె.. 1955లో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన 'చెరపకురా చెడేవు' చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యారు. భాషతో సంబంధం లేకుండా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 100కు పైగా సినిమాల్లో ఆమె నటించారు. ప్రముఖ నటులు ఎంజీఆర్, శివాజీ గణేషన్, జెమినీ గణేషన్, జైశంకర్ ల సినిమాల్లో నటించారు. తెలుగులో ఎన్నో చిత్రాలలో ఆమె నటించి ప్రేక్షకులను అలరించారు. 

1963లో ఏవీఎం రాజన్ సినిమా 'నానుమ్ ఒరు పెన్' చిత్రంలో ఆమె నటించారు. ఆ సందర్భంగా ప్రేమలో పడిన వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. వీరిలో ఒక కూతురు హీరోయిన్ గా రాణించింది. 


Pushpalatha
Tollywood

More Telugu News