వ‌ర‌ల్డ్ రికార్డు ముంగిట మహమ్మద్ షమీ.. మ‌రో 5 వికెట్లు తీస్తే చాలు..!

  • రేప‌టి నుంచి ఇంగ్లండ్ 3 మ్యాచ్ ల వ‌న్డే సిరీస్ ప్రారంభం 
  • నాగ్‌పూర్ వేదిక‌గా తొలి వ‌న్డే
  • ఇప్పటివరకు తాను ఆడిన 101 వన్డేల్లో 195 వికెట్లు తీసిన షమీ
  • మ‌రో 5 వికెట్లు తీస్తే.. వన్డేల్లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన స్టార్క్ రికార్డు స‌మం
ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్‌ను 4-1తో కైవ‌సం చేసుకున్న ఆతిథ్య భార‌త్ ఇప్పుడు వ‌న్డే సిరీస్‌పై క‌న్నేసింది. రేప‌టి నుంచి మూడు మ్యాచ్ ల వ‌న్డే సిరీస్ ప్రారంభం కానుంది. గురువారం నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ (వీసీఏ) స్టేడియంలో తొలి వ‌న్డే జరగనుంది. ఇక ఈ సిరీస్‌లో టీమిండియా స్పీడ్‌స్ట‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా లేక‌పోవ‌డంతో సీనియ‌ర్ పేస‌ర్ మహమ్మద్ షమీ బౌలింగ్ ద‌ళాన్ని న‌డిపించ‌నున్నాడు. 

అయితే, ఈ మ్యాచ్ కు ముందు షమీని ఓ వ‌ర‌ల్డ్ రికార్డు ఊరిస్తోంది. ఇప్పటివరకు తాను ఆడిన 101 వన్డేల్లో 195 వికెట్లు సాధించిన షమీ... నాగ్‌పూర్‌లో కనీసం ఐదు వికెట్లు పడగొట్టగలిగితే, అతను ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ ప్రపంచ రికార్డును స‌మం చేస్తాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన బౌలర్‌గా స్టార్క్‌తో పాటు సంయుక్తంగా అగ్ర‌స్థానంలో నిలుస్తాడు. ఆసీస్‌ స్టార్ పేస‌ర్ 102 మ్యాచ్‌ల‌లో తన 200వ వన్డే వికెట్‌ను సాధించాడు. రేపు ష‌మీ ఐదు వికెట్లు తీస్తే ఆ రికార్డును స‌మం చేస్తాడు.   

వన్డేల్లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన బౌలర్
మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా)- 102
సక్లైన్ ముస్తాక్ (పాకిస్తాన్)- 104
ట్రెంట్ బౌల్ట్ (న్యూజిలాండ్)- 107
బ్రెట్ లీ (ఆస్ట్రేలియా)- 112
అలెన్ డోనాల్డ్ (దక్షిణాఫ్రికా)- 117
వకార్ యూనిస్ (పాకిస్థాన్)- 118
షేన్ వార్న్ (ఆస్ట్రేలియా)- 125
మఖాయ్ ఎంతినీ (దక్షిణాఫ్రికా)- 126
లసిత్ మలింగ (శ్రీలంక)- 127
మిచెల్ జాన్సన్ (ఆస్ట్రేలియా)- 129

ఇక భారత్‌ తరపున వన్డేల్లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన బౌలర్‌ రికార్డు అజిత్ అగార్కర్ పేరిట ఉంది. 2004 డిసెంబర్ 26న ఢాకాలో బంగ్లాదేశ్‌తో జరిగిన 133వ మ్యాచ్‌లో అగార్కర్ తన 200వ వికెట్‌ను సాధించాడు.

టీమిండియా తరఫున అత్యంత వేగంగా 200 వన్డే వికెట్లు తీసిన బౌలర్లు
అజిత్ అగార్కర్- 133
జహీర్ ఖాన్- 144
అనిల్ కుంబ్లే- 147
జవగళ్ శ్రీనాథ్- 147
కపిల్ దేవ్- 166
హర్భజన్ సింగ్- 178
రవీంద్ర జడేజా- 182

కాగా, ఇప్పటివరకు వన్డేల్లో భారత్ తరఫున 200కి పైగా వికెట్లు సాధించిన బౌల‌ర్లు ఏడుగురు మాత్రమే. రాబోయే మ్యాచ్‌ల్లో షమీ ఐదు వికెట్లు తీస్తే ఈ జాబితాలో చేరిన ఎనిమిదో బౌలర్ అవుతాడు. అయితే, వన్డేల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన రికార్డు అనిల్ కుంబ్లే పేరిట ఉంది. కుంబ్లే 269 మ్యాచ్‌ల్లో 334 వికెట్లు తీశాడు.

వన్డేల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసింది వీరే..
అనిల్ కుంబ్లే- 334
జవగళ్ శ్రీనాథ్- 315
అజిత్ అగార్కర్- 288
జహీర్ ఖాన్- 269
హర్భజన్ సింగ్- 265
కపిల్ దేవ్- 253
హర్భజన్ సింగ్- 220
వెంకటేశ్‌ ప్రసాద్- 196
జహీర్ ఖాన్- 195
ఇర్ఫాన్ పఠాన్- 173
కుల్దీప్ యాదవ్- 172


More Telugu News