India-Pakistan Match: నిమిషాల్లోనే... హాట్ కేకుల్లా అమ్ముడైన భారత్-పాక్ మ్యాచ్ టికెట్లు

- ఈ నెల 19 నుంచి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ
- పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా మెగా ఈవెంట్
- ఫిబ్రవరి 23న భారత్-పాకిస్థాన్ సమరం
చిరకాల ప్రత్యర్థులు, దాయాదులు అయిన భారత్, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ లో తలపడితే అభిమానులకు లభించే వినోదం అంతా ఇంతా కాదు. ఈ రెండు జట్ల మ్యాచ్ అంటే స్టేడియంలు ఫుల్ అయిపోవాల్సిందే. తటస్థ వేదిక అయినా సరే ప్రేక్షకులు పోటెత్తుతారు. ఇప్పుడు అభిమానులకు మరోసారి భారత్-పాక్ క్రికెట్ సమరం చూసే చాన్స్ వచ్చింది.
ఈ నెల 19న పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీలో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య ఫిబ్రవరి 23న లీగ్ మ్యాచ్ జరగనుంది. ఈ హైఓల్టేజ్ పోరుకు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది.
కాగా, ఈ మ్యాచ్ కోసం ఐసీసీ టికెట్లను విడుదల చేసిన కొన్ని నిమిషాల్లోనే అయిపోయాయి. టికెట్ రేటు ఎంతైనా సరే వెనుకాడకుండా కొనేశారు. పాపం, టికెట్లు దొరకని వారు నిరాశ చెందుతున్నారు.
భారత జట్టు పాకిస్థాన్ లో పర్యటించబోమని చెప్పడంతో, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్ లో నిర్వహిస్తోంది. భారత్ ఆడే మ్యాచ్ లను దుబాయ్ లో నిర్వహించనున్నారు.