Ratan Tata: రతన్ టాటా స్నేహితుడు శంతను నాయుడుకు టాటా మోటార్స్‌లో కీలక పదవి

Shantanu Naidu new journey as General Manager at Tata Motors
  • చివరి దశలో రతన్ టాటా కేర్ టేకర్‌గాా వ్యవహరించిన శంతను నాయుడు
  • టాటా మోటార్స్‌లో స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్ జనరల్ మేనేజర్‌గా నియామకం
  • ఇప్పుడు నేనూ నా తండ్రిలా నడిచొచ్చే రోజులు వచ్చాయని పోస్ట్
దివంగత రతన్ టాటా యువ స్నేహితుడు శంతను నాయుడుకు టాటా మోటార్స్‌లో కీలక పదవి లభించింది. రతన్ టాటా చివరి దశలో కేర్ టేకర్‌గా శంతను నాయుడు వ్యవహరించారు. టాటా మోటార్స్‌లో స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్‌కు జనరల్ మేనేజర్‌గా శంతను నియమితులయ్యారు.

ఇందుకు సంబంధించిన విషయాన్ని తెలియజేస్తూ శంతను లింక్డిన్‌లో పోస్ట్ చేస్తూ, ఆనందం వ్యక్తం చేశారు. టాటా మోటార్స్ ప్లాంట్ నుండి తెలుపు రంగు చొక్కా, నేవీ బ్లూ ప్యాంట్‌లో తన తండ్రి నడుచుకుంటూ ఇంటికి వచ్చేవారని, ఆ సమయంలో తాను ఆయన కోసం ఎదురుచూస్తూ కిటికీలో నుండి చూసేవాడినని శంతను పేర్కొన్నారు. ఇప్పుడు నేను కూడా అలా నడిచొచ్చే రోజులు వచ్చాయని రాసుకొచ్చారు.

టాటా ట్రస్ట్‌లో పిన్న వయస్కుడైన శంతను 2018 నుండి రతన్ టాటాకు అసిస్టెంట్‌గా వ్యవహరించాడు. వీరిద్దరికి మంచి అనుబంధం ఏర్పడింది.
Ratan Tata
Shantanu Naidu
Business News

More Telugu News