Game Changer: ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'గేమ్ ఛేంజర్'.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే..!

- రామ్‌చరణ్, శంకర్ కాంబోలో 'గేమ్ ఛేంజర్'
- జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీకి మిక్స్‌డ్ టాక్
- ఈ నెల 7 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్
- ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన ఓటీటీ సంస్థ
- విడుదలైన 28 రోజుల్లోనే ఓటీటీలోకి మూవీ
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్, ప్రముఖ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో వచ్చిన మూవీ 'గేమ్ ఛేంజర్'. ఈ సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ నెల 7 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందని అమెజాన్ తాజాగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. కాగా, మూవీ విడుదలైన 28 రోజుల్లోనే ఓటీటీలోకి రానుండటం గమనార్హం.
కాగా, ఈ సినిమాలో తండ్రీకొడుకులుగా రామ్ నందన్, అప్పన్న పాత్రల్లో రామ్ చరణ్ అదరగొట్టారు. చరణ్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇక చెర్రీకి జోడిగా బాలీవుడ్ నటి కియారా అద్వానీ నటించిన ఈ సినిమాను శ్రీవెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించారు. తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఈ మూవీకి కథను అందించగా.. సముద్రఖని, ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర, అంజలి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు.