రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కు వచ్చిన మోహన్ బాబు, మంచు మనోజ్

  • రక్షణ కల్పించాలంటూ కొన్నిరోజుల క్రితం మోహన్ బాబు లేఖ
  • మనోజ్ తన ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించాడని మోహన్ బాబు ఆరోపణ
  • మోహన్ బాబు పిటిషన్‌పై అదనపు కలెక్టర్‌కు వివరణ ఇచ్చిన మనోజ్
టాలీవుడ్ సినీ నటుడు మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ ఈరోజు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్‌లోని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి విచ్చేశారు.

తల్లిదండ్రులు, వృద్ధుల సంరక్షణ, పోషణ చట్టం కింద తనకు రక్షణ కల్పించాలంటూ కొన్ని రోజుల క్రితం తన ప్రతినిధి ద్వారా మోహన్ బాబు ఒక లేఖను పంపించారు. బాలాపూర్ మండలం జల్‌పల్లి గ్రామంలో తాను నివాసం ఉంటున్న ఇంట్లోకి మనోజ్ అక్రమంగా ప్రవేశించారని, ఆస్తులు కావాలంటూ డిమాండ్ చేస్తున్నారని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.

మోహన్ బాబు వేసిన పిటిషన్‌పై ఇటీవల రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ఎదుట మంచు మనోజ్ విచారణకు హాజరై వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో నేడు మోహన్ బాబు కలెక్టర్‌ను కలవడానికి వచ్చారు. ఆ తరువాత మంచు మనోజ్ కూడా కలెక్టరేట్‌కు వచ్చి అధికారులను కలిశారు.


More Telugu News