ప్ర‌పంచ ఛాంపియ‌న్ గుకేశ్‌ను ఓడించి.. టైటిల్ గెలిచిన ప్ర‌జ్ఞానంద‌

  • ప్ర‌పంచ ఛాంపియ‌న్ గుకేశ్‌కు టాటా స్టీల్ చెస్ మాస్ట‌ర్స్‌లో చుక్కెదురు  
  • టాటా స్టీల్ చెస్ మాస్ట‌ర్స్‌ టైటిల్ గెలిచిన ప్ర‌జ్ఞానంద‌
  • టైబ్రేక‌ర్‌లో గుకేశ్‌పై ప్ర‌జ్ఞానంద అద్భుత విజ‌యం
ఇటీవ‌ల వ‌రల్డ్ టైటిల్ ఛాంపియ‌న్‌షిప్ గెలిచిన డీ గుకేశ్‌కు మ‌రో భార‌త గ్రాండ్‌మాస్ట‌ర్ ప్ర‌జ్ఞానంద తాజాగా ఝుల‌క్ ఇచ్చాడు. ప్ర‌పంచ ఛాంపియ‌న్ గుకేశ్‌ను ఓడించి ప్ర‌జ్ఞానంద టాటా స్టీల్ చెస్ మాస్ట‌ర్స్‌ టైటిల్ గెలిచాడు. టైబ్రేక‌ర్‌లో గుకేశ్‌పై ప్ర‌జ్ఞానంద గెలిచాడు. అంత‌కుముందు ప్ర‌జ్ఞానంద‌, గుకేశ్ త‌మ చివ‌రిదైన 13వ రౌండ్‌లో ఓడిపోయారు. 

విన్సెంట్ చేతిలో ప్ర‌జ్ఞానంద ప‌రాజయం పొందితే.. గుకేశ్‌ను అర్జున్ ఇరిగైశి ఓడించాడు. అయితే, 8.5 పాయింట్ల‌తో సంయుక్తంగా అగ్ర‌స్థానంలో ఉన్న ప్ర‌జ్ఞానంద‌, గుకేశ్ టైటిల్ కోసం టైబ్రేక‌ర్‌లో పోటీప‌డ్డారు. ఇందులో విజ‌యం సాధించిన ప్ర‌జ్ఞానంద టైటిల్ విజేత‌గా నిలిచాడు. 


More Telugu News