Abhishek Sharma: ఊచకోత అంటే ఇదే... 37 బంతుల్లో 100 కొట్టిన అభిషేక్ శర్మ

Abhishek Sharma records second fastest century in T20 cricket

  • ఇంగ్లండ్ తో చివరి టీ20
  • ముంబయి వాంఖెడే స్టేడియంలో మ్యాచ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
  • ఇంగ్లండ్ బౌలర్లను చీల్చిచెండాడిన అభిషేక్ శర్మ
  • రెండో వేగవంతమైన సెంచరీ నమోదు

ఇంగ్లండ్ తో చివరి టీ20లో టీమిండియా యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ వీరవిహారం చేశాడు. కేవలం 37 బంతుల్లో 100 పరుగులు సాధించాడు. తొలి 50 పరుగులు చేయడానికి 17 బంతులు ఆడిన అభిషేక్ శర్మ, మరో 50 పరుగులు చేసేందుకు 20 బంతులు ఆడాడు. 

ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, మార్క్ ఉడ్ వంటి సూపర్ ఫాస్ట్ బౌలర్లు ఉన్నప్పటికీ అభిషేక్ శర్మ ఏమాత్రం లెక్కచేయకుండా బౌండరీల వర్షం కురిపించాడు. ముఖ్యంగా, ఇంగ్లండ్ స్పిన్నర్లను ఈ లెఫ్ట్ హ్యాండర్ చీల్చిచెండాడు. భారీ సిక్సర్లతో హడలెత్తించాడు. ఐసీసీ టెస్టు హోదా ఉన్న దేశాలపై టీ20ల్లో ఇదే రెండో అత్యంత వేగవంతమైన సెంచరీ. గతంలో రోహిత్ శర్మ, డేవిడ్ మిల్లర్ (దక్షిణాఫ్రికా) 35 బంతుల్లోనే సెంచరీ నమోదు చేశారు. 

నేటి మ్యాచ్ లో ప్రస్తుతం టీమిండియా స్కోరు 12 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 161 పరుగులు. అభిషేక్ శర్మ 102 పరుగులు, శివమ్ దూబే 14 పరుగులతో ఆడుతున్నారు. అభిషేక్ శర్మ స్కోరులో 5 ఫోర్లు, 10 సిక్సులు ఉన్నాయి.

Abhishek Sharma
Second Fastest Century
Team India
England
Mumbai
5th T20I
  • Loading...

More Telugu News