మన నారీ శక్తి పట్ల గర్విస్తున్నా... టీమిండియా వరల్డ్ కప్ గెలవడంపై ప్రధాని మోదీ స్పందన
- అండర్-19 వరల్డ్ కప్ గెలిచిన భారత అమ్మాయిలు
- అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ
- అద్భుతమైన సమష్టి కృషి ఫలితం ఈ విజయం అంటూ ట్వీట్
ఈ విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. మన నారీ శక్తి పట్ల అమితంగా గర్విస్తున్నానంటూ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
"ఐసీసీ అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్-2025లో విజేతలుగా నిలిచినందుకు భారత జట్టుకు అభినందనలు. అద్భుతమైన సమష్టి కృషి, మన పట్టుదల, దృఢ సంకల్పం ఫలితమే ఈ విజయం. ఔత్సాహిక క్రీడాకారులకు ఈ గెలుపు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. టీమిండియా అమ్మాయిల జట్టు భవిష్యత్తులోనూ ఇలాంటి విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అంటూ మోదీ ట్వీట్ చేశారు.