మన నారీ శక్తి పట్ల గర్విస్తున్నా... టీమిండియా వరల్డ్ కప్ గెలవడంపై ప్రధాని మోదీ స్పందన

PM Modi congratulates Indian team for winning ICC Under19 T20 Wolrdcup
  • అండర్-19 వరల్డ్ కప్ గెలిచిన భారత అమ్మాయిలు
  • అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ
  • అద్భుతమైన సమష్టి కృషి ఫలితం ఈ విజయం అంటూ ట్వీట్
భారత అమ్మాయిల జట్టు ఐసీసీ అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్ గెలవడం తెలిసిందే. ఈ విజయం పట్ల యావత్ భారతదేశం సంతోషంతో పొంగిపోతోంది. 2023లో ఈ టోర్నీ తొలిసారిగా నిర్వహించగా, టైటిల్ గెలిచిన భారత్... 2025లోనూ టోర్నీలో విజేతగా నిలిచింది. మలేషియాలో జరిగిన ఈ ఐసీసీ ఈవెంట్ లో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలో దిగిన టీమిండియా మహిళల జట్టు ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి టైటిల్ నిలబెట్టుకుంది. 

ఈ విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. మన నారీ శక్తి పట్ల అమితంగా గర్విస్తున్నానంటూ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. 

"ఐసీసీ అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్-2025లో విజేతలుగా నిలిచినందుకు భారత జట్టుకు అభినందనలు. అద్భుతమైన సమష్టి కృషి, మన పట్టుదల, దృఢ సంకల్పం ఫలితమే ఈ విజయం. ఔత్సాహిక క్రీడాకారులకు ఈ గెలుపు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. టీమిండియా అమ్మాయిల జట్టు భవిష్యత్తులోనూ ఇలాంటి విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అంటూ మోదీ ట్వీట్ చేశారు.
Go Back to Shorts
ICC Under19 T20 Wolrdcup
Team India
Narendra Modi
India

More Telugu News