Tamil Nadu: కాలేజీ టాయిలెట్‌లో ప్రసవం.. యూట్యూబ్‌లో చూసి బొడ్డుకోసి శిశువును చెత్తకుప్పలో పడేసిన విద్యార్థిని!

Pregnancy college girl delivered in college toilet in Kumbakonam
  • తమిళనాడులోని తంజావూరు జిల్లాలో ఘటన
  • శుక్రవారం క్లాసు వింటుండగా విద్యార్థినికి పురిటినొప్పులు
  • టాయిలెట్‌కు వెళ్లి బిడ్డను ప్రసవించిన యువతి
  • మళ్లీ వచ్చి క్లాసులో కూర్చున్న వైనం
  • రక్తస్రావం అవుతుండటంతో గుర్తించి ఆసుపత్రికి తరలింపు
కాలేజీ టాయిలెట్‌లో ప్రసవించిన ఓ విద్యార్థిని.. యూట్యూబ్‌లో చూసి శిశువు బొడ్డుకోసి చెత్త కుప్పలో పడేసింది. తమిళనాడులోని తంజావూర్‌లో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. కుంభకోణంలోని ప్రభుత్వ మహిళా కాలేజీలో 4 వేలమందికిపైగా అమ్మాయిలు చదువుకుంటున్నారు. వారిలో ఓ విద్యార్థిని (20) గర్భం దాల్చింది. అయితే, ఆ విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడింది.

శుక్రవారం క్లాసు వింటుండగానే ఆమెకు పురిటినొప్పులు మొదలయ్యాయి. దీంతో టాయిలెట్‌కు వెళ్లిన ఆమె అక్కడే శిశువుకు జన్మనిచ్చింది. అనంతరం యూట్యూబ్‌లో చూసి శిశువు బొడ్డు కోసింది. అనంతరం చెత్తకుప్పలో శిశువును పడేసి పైన చెత్త కప్పేసింది. తర్వాత ఏమీ ఎరగనట్టు తరగతి గదిలోకి వెళ్లి కూర్చుంది. అయితే, ఆమె నుంచి రక్త్రస్రావం అవుతుండటాన్ని గుర్తించిన తోటి అమ్మాయిలు విషయాన్ని లెక్చరర్ల దృష్టికి తీసుకెళ్లడంతో వారు 108 అంబులెన్స్‌ను పిలిపించి ఆసుపత్రికి తరలించారు. అక్కడ  పరిక్షించిన వైద్యులు ఆమె ప్రసవించినట్టు గుర్తించి బిడ్డ గురించి ఆరా తీశారు. అంబులెన్స్‌ను పంపి కళాశాల చెత్తకుప్పలో పడివున్న శిశువును ఆసుపత్రికి తీసుకొచ్చారు. వెంటనే చికిత్స అందించడంతో శిశువు బతికింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Tamil Nadu
College Girl
Kumbakonam
Thanjavur

More Telugu News