Gachibowli Firing: హైదరాబాద్ గచ్చిబౌలిలో కాల్పుల కలకలం

Firing at Gachibowli pub
  • గచ్చిబౌలిలోని ప్రిజమ్ పబ్ కు వచ్చిన దొంగ
  • పట్టుకునేందుకు పోలీసుల యత్నం
  • రెండు రౌండ్లు కాల్పులు జరిపిన దొంగ
  • దొంగను మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్ గా గుర్తింపు
హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో నేడు కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఓ దొంగ పోలీసులపై కాల్పులు జరిపాడు. దొంగ గచ్చిబౌలిలోని ప్రిజమ్ పబ్ కు వచ్చాడన్న సమాచారంతో పోలీసులు అతడిని పట్టుకునేందుకు వచ్చారు. పోలీసులను గమనించిన దొంగ వారిపై రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్ వెంకట్రామ్ రెడ్డికి, ఓ బౌన్సర్ కు గాయాలయ్యాయి. కానిస్టేబుల్ తొడలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. ఎట్టకేలకు పోలీసులు దొంగను అదుపులోకి తీసుకున్నారు. 

కాగా, ఆ దొంగను పోలీసులు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్ గా గుర్తించారు. అతడిపై పలు కేసులు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కాల్పుల ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు ఆరా తీశారు. కాగా, గాయపడిన పోలీస్ కానిస్టేబుల్ ను, బౌన్సర్ ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం.
Gachibowli Firing
Thief
Police
Pub
Hyderabad

More Telugu News