ఆకాశంలో ఢీకొన్న విమానం-హెలికాప్టర్.. వీడియో ఇదిగో!

  • అమెరికాలోని వాషింగ్టన్ ఎయిర్‌పోర్టులో ఘటన
  • నదిలో పడిపోయిన విమాన, ఆర్మీ హెలికాప్టర్ శకలాలు
  • విమానాశ్రయాన్ని మూసివేసిన అధికారులు
అమెరికాలోని రొనాల్డ్ రీగన్ వాషింగ్టన్ నేషనల్ ఎయిర్‌పోర్టులో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వస్తున్న విమానం ల్యాండ్ అవుతూ గాల్లోనే ఓ ఆర్మీ హెలికాప్టర్‌ను ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో రెండూ పేలిపోయాయి. గత రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. పోటోమేక్ నది పైన ఈ ఘటన జరగడంతో విమాన, హెలికాప్టర్ శకలాలు అందులో పడిపోయాయి. 

ప్రమాద మృతులు, ఇతర వివరాలు తెలియరాలేదు. ఈ ఘటనతో విమానాశ్రయాన్ని మూసివేసినట్టు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) తెలిపింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మిలటరీ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. నదిలో గాలింపు మొదలు పెట్టారు. నదిలో ఫైర్ బోట్లను మోహరించారు.


More Telugu News