K. Keshava Rao: కేకే కుటుంబానికి హైదరాబాద్‌లో తక్కువ ధరకు భూమిని కేటాయించారంటూ హైకోర్టులో పిటిషన్

Petition in TG HC on regularisation of land to KK family
  • హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన రఘువీర్ రెడ్డి
  • జీవో నెంబర్ 56 ద్వారా భూమిని క్రమబద్ధీకరించారంటూ పిటిషన్
  • కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కోరిన ప్రతివాదుల తరపు న్యాయవాదులు
బంజారాహిల్స్‌లోని ఎన్‌బీటీ నగర్‌లో గల భూమిని ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు కుటుంబ సభ్యులకు తక్కువ ధరకు కట్టబెట్టారంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ భూమిని జీవో నంబర్ 56 ద్వారా కె.కె. కుటుంబానికి క్రమబద్ధీకరించారని రఘువీర్ రెడ్డి అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ప్రతివాదులుగా రెవెన్యూ అధికారులు, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జీపీఏ హోల్డర్ కవితలను చేర్చారు.

ఈ భూమిని తక్కువ ధరకు కేటాయించారని, ఈ స్థల కేటాయింపునకు సంబంధించిన జీవోను రద్దు చేయాలని పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్‌‍ పై సీజే ధర్మాసనం బుధవారం నాడు విచారణ చేపట్టింది. కౌంటర్ దాఖలు చేయడానికి ప్రతివాదుల తరఫు న్యాయవాదులు సమయం కోరారు. దీంతో హైకోర్టు తదుపరి విచారణను ఫిబ్రవరి 27కు వాయిదా వేసింది.
K. Keshava Rao
Telangana
Hyderabad
Congress

More Telugu News