మూడో టీ20: టాస్ గెలిచిన టీమిండియా... ఇంగ్లండ్ దూకుడు
- రాజ్ కోట్ లో మ్యాచ్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
- 8 ఓవర్లలో 1 వికెట్ కు 74 పరుగులు చేసిన ఇంగ్లండ్
ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా టీమిండియా, ఇంగ్లండ్ మధ్య నేడు మూడో మ్యాచ్ జరుగుతోంది. రాజ్ కోట్ లోని నిరంజన్ షా స్టేడియం ఈ మ్యాచ్ కు వేదిక. టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. దాంతో మొదట బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ జట్టు ఆరంభంలోనే వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన ఓపెనర్ ఫిల్ సాల్ట్... హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో అవుటయ్యాడు.
అయితే, మరో ఓపెనర్ బెన్ డకెట్, కెప్టెన్ జోస్ బట్లర్ దూకుడుగా ఆడుతూ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లారు. 8 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ స్కోరు 1 వికెట్ నష్టానికి 74 పరుగులు. డకెట్ 22 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులతో 42 పరుగులు... బట్లర్ 19 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్ తో 23 పరుగులతో ఆడుతున్నారు. ఈ మ్యాచ్ ద్వారా మహ్మద్ షమీ టీమిండియాలోకి పునరాగమనం చేశాడు.