థ్యాంక్యూ చంద్ర‌బాబు గారూ.. మీ శిష్యుడికి అవ‌గాహ‌న క‌ల్పించండి.. కేటీఆర్ ఆస‌క్తిక‌ర ట్వీట్‌

BRS Working President KTR Interesting Tweet on CBN
      
బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ తాజాగా ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిల‌ను ప్ర‌స్తావిస్తూ 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ఓ ఆస‌క్తిక‌ర పోస్టు చేశారు. ఇప్పుడీ ట్వీట్ సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. 

గ‌త దశాబ్ద కాలంగా ప్ర‌గ‌తిశీల ప్ర‌భుత్వ విధానాల వ‌ల్ల దేశంలోనే అత్య‌ధిక త‌ల‌స‌రి ఆదాయం క‌లిగిన రాష్ట్రంగా తెలంగాణ అవ‌త‌రించింద‌ని కేటీఆర్ అన్నారు. ఈ విష‌యాన్ని ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కూడా అనేక సంద‌ర్భాల్లో ప్ర‌స్తావించార‌ని గుర్తు చేస్తూ ఆయ‌న మాట్లాడిన వీడియోను త‌న ట్వీట్‌కు జోడించారు కేటీఆర్‌.

"థ్యాంక్యూ చంద్ర‌బాబు గారూ.. ద‌య‌చేసి ఈ వాస్త‌వాన్ని జీర్ణించుకోలేని మీ పూర్వ శిష్యుడికి దీనిపై అవ‌గాహ‌న క‌ల్పించండి" అని ట్వీట్‌లో రాసుకొచ్చారు.
Go Back to Shorts
KTR
BRS
Chandrababu
Revanth Reddy
Telangana
Andhra Pradesh

More Telugu News