Noman Ali: చ‌రిత్ర సృష్టించిన పాక్ బౌల‌ర్ నోమ‌న్‌ అలీ.. స్పిన్న‌ర్ పేరిట అరుదైన రికార్డు!

1st Time Since 1952 Pakistan Spinner Noman Ali Scripts History With Test Hat Trick

  • ముల్తాన్‌లో వెస్టిండీస్‌తో పాకిస్థాన్ రెండో టెస్టు
  • హ్యాట్రిక్ సాధించిన తొలి స్పిన్న‌ర్‌గా నోమన్ అలీ రికార్డు
  • ఇప్ప‌టివ‌ర‌కు పాక్‌ త‌ర‌ఫున ఏ స్పిన్న‌ర్ ఈ ఫీట్‌ను సాధించ‌ని వైనం

ముల్తాన్‌లో వెస్టిండీస్‌తో జరుగుతున్న‌ రెండో టెస్టులో పాకిస్థాన్ స్పిన్న‌ర్ నోమ‌న్‌ అలీ చ‌రిత్ర సృష్టించాడు. హ్యాట్రిక్ సాధించిన తొలి స్పిన్ బౌలర్‌గా నోమన్ అలీ రికార్డుకెక్కాడు. పాక్‌ 1952లో తొలి టెస్టు మ్యాచ్ ఆడిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు ఆ జ‌ట్టు త‌ర‌ఫున ఇలా హ్యాట్రిక్ వికెట్లు తీసిన స్పిన్న‌ర్ లేరు. 

నోమన్ అలీ వ‌రుస‌గా మూడు బంతుల్లో జస్టిన్ గ్రీవ్స్, టెవిన్ ఇమ్లాచ్, కెవిన్ సింక్లెయిర్‌ల వికెట్లను పడగొట్టాడు. ఇక టాస్ గెలిచి మొద‌ట బ్యాటింగ్‌కు దిగిన పర్యాటక జట్టును నోమ‌న్ అలీ బెంబేలెత్తించాడు. దాంతో కేవలం 38 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి విండీస్‌ పీక‌ల‌లోతు క‌ష్టాల్లో ప‌డింది. 

అయితే, మ‌రోసారి వెస్టిండీస్ టైలెండ‌ర్లు ఆ జ‌ట్టును ఆదుకున్నారు. గుడాకేశ్ మోతీ హాఫ్ సెంచ‌రీ (55) చేయ‌డంతో పాటు కీమ‌ర్ రోచ్ 25, వారికెన్ 36 ప‌రుగుల‌తో రాణించారు. దీంతో క‌రేబియ‌న్ జ‌ట్టు 163 ర‌న్స్ చేసి ఆలౌట్ అయింది. నోమ‌న్ అలీ మొత్తం 6 వికెట్లు తీసి విండీస్ ఇన్నింగ్స్‌ను కుప్ప‌కూల్చాడు. అలాగే సాజిద్ ఖాన్ 2 వికెట్లు తీస్తే... కాషిఫ్ అలీ, అబ్రార్ చెరో వికెట్ ప‌డ‌గొట్టారు.   


Noman Ali
Pakistan
Spinner
Hat Trick
Cricket
Sports News
  • Loading...

More Telugu News