KCR: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సోదరి కన్నుమూత

Telangana former CM KCR sister Sakalamma dies
    
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) సోదరి చీటి సకలమ్మ గత రాత్రి మృతి చెందారు. ఆమె వయసు 82 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో గత రాత్రి తుదిశ్వాస విడిచారు. 

కేసీఆర్‌కు సకలమ్మ ఐదో సోదరి. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని పెదిర ఆమె స్వగ్రామం. ఆమె భర్త హన్మంతరావు కొన్నేళ్ల క్రితమే మృతి చెందారు. వీరికి ముగ్గురు కుమారులున్నారు. సకలమ్మ మరణవార్త తెలుసుకున్న బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీశ్‌రావు, కవిత ఆసుపత్రికి వెళ్లారు. నేడు ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సకలమ్మ మృతి నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పోరేటర్లు , ఇతర ముఖ్యనాయకులతో నేడు నిర్వహించతలపెట్టిన సమావేశాన్ని వాయిదా వేశారు. 
KCR
Sakalamma
BRS
KTR

More Telugu News