Director Missing: సినీ దర్శకుడు రమేశ్ కృష్ణ అదృశ్యం

Tollywood director Ramesh Krishna missing
  • ఈ నెల 4న ఇంటి నుంచి బయటకు వెళ్లిన రమేశ్ కృష్ణ
  • ఇంతవరకు తిరిగి రాని వైనం
  • మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన రమేశ్ కృష్ణ భార్య
టాలీవుడ్ దర్శకుడు ఓం రమేశ్ కృష్ణ (46) అదృశ్యమయ్యారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మియాపూర్ లోని ఫ్రెండ్స్ కాలనీలో ఆయన నివాసముంటున్నారు. ఈ నెల 4వ తేదీన ఆయన ఇంటి నుంచి బయటకు వెళ్లారు. ఇంతవరకు తిరిగి రాలేదు. 

దీంతో రమేశ్ కృష్ణ భార్య శ్రీదేవి మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎంత వెతికినా తన భర్త ఆచూకీ దొరకలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇండస్ట్రీలో రమేశ్ తో పని చేసిన వారిని, ఆయన స్నేహితులను విచారిస్తున్నారు. రమేశ్ కృష్ణ మిస్సింగ్ అంశం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.
Director Missing
Tollywood
Ramesh Krishna

More Telugu News