Nara Lokesh: టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నారా లోకేశ్ బర్త్ డే వేడుకలు

Nara Lokesh birthday celebrations held grandly in TDP Head Office
  • నేడు మంత్రి నారా లోకేశ్ పుట్టినరోజు 
  • టీడీపీ ప్రధాన కార్యాలయంలో కేక్ కటింగ్
  • కేక్ కట్ చేసి ఇతర నేతలకు తినిపించిన మంత్రి గొట్టిపాటి
రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, విద్య, మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నేడు (జనవరి 23)) పుట్టినరోజు జరుపుకుంటున్నారు. లోకేశ్ జన్మదిన వేడుకలను మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. 

రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, ఏపీ మైనార్టీ కార్పొరేషన్ సలహాదారు ఎం.ఏ.షరీఫ్ ల సమక్షంలో కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. మంత్రి గొట్టిపాటి రవికుమార్, వర్ల రామయ్య కేక్ కట్ చేసి నాయకులకు తినిపించారు. 

నారా లోకేశ్ జన్మదినం సందర్భంగా పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు స్వీట్లు పంచుకున్నారు. తమ ప్రియతమ నేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. 

దావోస్ పర్యటనలో నారా లోకేష్ రాష్ట్రం కోసం చేస్తున్న కృషి ఫలించాలని, రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులు రావాలని, తద్వారా రాష్ట్ర యువత భవిష్యత్తు బాగుండాలని నేతలు ఆకాంక్షించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాతర్ల రమేష్, ఏవీ రమణ, కోడూరి అఖిల్ కుమార్, హసన్ బాషా, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Nara Lokesh
Birthday
Celebrations
TDP
Mangalagiri
Davos

More Telugu News