సిల్క్ స్మిత సంపాదించిందంతా ఏమైపోయింది .. అందరూ ఏం చేస్తున్నట్టు? : తమ్ముడు నాగవరప్రసాద్
- వివిధ భాషల్లో నటించిన సిల్క్ స్మిత
- ఆ రోజుల్లో కోట్ల రూపాయలు సంపాదించిందన్న సోదరుడు
- తన ఆస్తిపాస్తులు కాజేశారని వెల్లడి
- ఆమె చనిపోతే ఇండస్ట్రీ వారెవరూ పట్టించుకోలేదని వ్యాఖ్య
" మా అక్కయ్య చాలా భాషలలో నటిస్తూ చాలా బిజీగా ఉండేది .. డబ్బు బాగా వస్తుండేది. అలాంటి పరిస్థితులలో ఒక వ్యక్తి ఆమెకి చేరువయ్యాడు. అతనికి భార్య .. ముగ్గురు పిల్లలు ఉన్నారు. మా అక్కయ్య అతనిని పూర్తిగా నమ్మింది. ఒకరోజు రాత్రి అతను .. అతని పిల్లలు కలిసి ఆమెను చంపేశారు. డబ్బు .. నగలు .. డాక్యుమెంట్లు కాజేశారు. మేము వెళ్లేలోగా అందరినీ మేనేజ్ చేశారు. మా దగ్గర డబ్బు లేదు .. చదువులేదు. అక్కడ మాకు ఎవరి నుంచి ఎలాంటి సపోర్టు లేదు. దాంతో ఏం చేయాలో మాకు పాలుపోలేదు" అని చెప్పారు.
" మా అక్కయ్యను చూడటానికి అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు. కానీ ఇండస్ట్రీ నుంచి ఒక్క 'అర్జున్' తప్ప ఎవరూ రాలేదు. మా గురించి ఎవరూ పట్టించుకోలేదు. అనాథల మాదిరిగా అలా రోడ్డుపై నుంచుండి పోయాము. మా అక్కయ్య అప్పట్లోనే 20 కోట్లకి పైగా సంపాదించి ఉంటుంది. ఆ డబ్బంతా ఏమైపోయినట్టు? అంత మంచి మనిషికి ఇంతటి అన్యాయం జరుగుతూ ఉంటే అందరూ ఏం చేస్తున్నట్టు? నా మీద ఒట్టేసి చెబుతున్నాను . మా అక్కయ్య చనిపోయిన తరువాత ఆమెకి సంబంధించిన ఒక్క రూపాయి కూడా మా వరకూ రాలేదు" అని ఆవేదన వ్యక్తం చేశారు.