Sai Pallavi: అడిగి తీసుకోవాలి.. అభిమానులకు సాయిపల్లవి సూచన

Sai Pallavi Reaction On Fans Selfies

  • బయటకు వెళ్లినపుడు ఫొటోలు తీసుకోవడంపై అసంతృప్తి
  • నేనూ మనిషినే కదా అంటూ వ్యాఖ్య
  • తనను ఫొటోలు తీయడం అస్సలు నచ్చదన్న నటి

నేచురల్ బ్యూటీ సాయిపల్లవి అభిమానుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బయటికి వెళ్లినపుడు కొంతమంది చెప్పాపెట్టకుండా ఫొటోలు తీసుకుంటారని, అది తనకు నచ్చదని అన్నారు. తానేమీ అందమైన చెట్టునో, ఇల్లునో కాదని తానూ మనిషినేనని, తన అనుమతి లేకుండా ఫొటోలు తీయడం సరికాదని చెప్పారు. మిమ్మల్ని ఒక ఫొటో తీసుకోవచ్చా? అని అడిగి తీసుకుంటే బాగుంటుందని సూచించారు. తనకే కాదు ప్రతీ మనిషికీ కొన్ని విషయాలు నచ్చవని, కొన్ని భయాలు వెంటాడుతుంటాయని అన్నారు. అలాగే తనకూ ఇతరులు తనను ఫొటోలు తీయడం నచ్చదని చెప్పారు.

అనుమతి కూడా అడక్కుండా ఫొటోలు తీయడం చూస్తుంటే తన పర్మిషన్ లేకుండా వీరంతా ఇలా ఎందుకు చేస్తున్నారని అనుకుంటానని సాయిపల్లవి తెలిపారు. కాగా, సాయిపల్లవి హీరోయిన్ గా నటించిన అమరన్ సినిమా ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. నాగచైతన్య సరసన నటించిన తండేల్ సినిమా విడుదలకు సిద్ధమైంది. వచ్చే నెల 7న థియేటర్లలోకి రానుంది. మరోవైపు, సాయిపల్లవి బాలీవుడ్ లోనూ ఎంట్రీ ఇస్తున్నారు. హిందీ రామాయణం చిత్రంలో సాయిపల్లవి నటిస్తున్నారు.

  • Loading...

More Telugu News