AP BJP: ఏపీలో అన్ని జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించిన బీజేపీ

bjp has announced party presidents for all the districts of ap
  • జిల్లా పార్టీ అధ్యక్ష పదవులకు ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు నిర్వహించామన్న బీజేపీ
  • నూతన అధ్యక్షులకు అభినందనలు తెలిపిన పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి
ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాలకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధ్యక్షులను నియమించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించి నూతన అధ్యక్షులను ఎంపిక చేసినట్లు బీజేపీ ప్రకటన విడుదల చేసింది. మొత్తం 24 జిల్లాలకు కొత్త అధ్యక్షులను బీజేపీ ప్రకటించింది. ఎన్నికైన వారికి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, ఆ పార్టీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అభినందనలు తెలిపారు.

జిల్లాల వారీగా అధ్యక్షులు:
  • పార్వతీపురం మన్యం జిల్లా – ద్వారపురెడ్డి శ్రీనివాసరావు
  • అల్లూరి సీతారామరాజు జిల్లా (అరకు) – మఠం శాంతకుమారి
  • శ్రీకాకుళం జిల్లా – సిరిపురం తేజేశ్వరరావు
  • విజయనగరం జిల్లా – ఉప్పలపాటి రాజేశ్ వర్మ
  • విశాఖపట్నం జిల్లా – మంతెన పరుశురాంరాజు
  • అనకాపల్లి జిల్లా – ద్వారపురెడ్డి పరమేశ్వరరావు
  • కాకినాడ జిల్లా – బిక్కిన విశ్వేశ్వరరావు 
  • డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా – అడబాల సత్యనారాయణ
  • తూర్పు గోదావరి జిల్లా – పిక్కి నాగేంద్ర
  • పశ్చిమ గోదావరి జిల్లా – ఐనంపూడి శ్రీదేవి
  • ఏలూరు జిల్లా – చౌటపల్లి విక్రమ్ కిశోర్
  • ఎన్టీఆర్ జిల్లా – అడ్డూరి శ్రీరామ్
  • గుంటూరు జిల్లా – చెరుకూరి తిరుపతిరావు
  • పల్నాడు జిల్లా – ఏలూరి వెంకట మారుతి శశి కుమార్
  • ఒంగోలు జిల్లా – సెగ్గం శ్రీనివాసులు
  • నెల్లూరు జిల్లా – పారెడ్డి వంశీధర్ రెడ్డి
  • తిరుపతి జిల్లా – సామంచి శ్రీనివాసరావు
  • అన్నమయ్య జిల్లా – వసంత సాయి లోకేశ్
  • చిత్తూరు జిల్లా – సూరపనేని జగదీశ్వర్ నాయుడు
  • కడప జిల్లా – జంగిటి వెంకట సుబ్బారెడ్డి
  • సత్యసాయి జిల్లా – గోరంట్ల మోహన్ శేఖర్
  • అనంతపూర్ జిల్లా – కొనకొండ్ల రాజేశ్
  • కర్నూలు జిల్లా – బాపురం రామకృష్ణ పరమహంస
  • నంద్యాల జిల్లా – అభిరుచి మధు
AP BJP
Daggubati Purandeswari
party presidents

More Telugu News