పంజాబ్ కింగ్స్ ఎక్కడ తీసుకుంటుందోనని టెన్షన్ పడ్డా: రిషభ్‌పంత్
- ఐపీఎల్ మెగా వేలంలో పంత్‌కు రూ. 27 కోట్ల ధర
- లక్నో సారథ్య బాధ్యతలు పంత్‌కు అప్పగింత
- వేలం నాటి సంగతులను గుర్తు చేసుకున్న పంత్
పంజాబ్ వద్ద పర్స్ ఎక్కువగా ఉండటంతో ఆ జట్టు తనను ఎక్కడ దక్కించుకుంటుందోనని టెన్షన్ అనుభవించానని పంత్ గుర్తు చేసుకున్నాడు. కానీ, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ శ్రేయాస్ అయ్యర్‌ను పంజాబ్ రూ. 26.75 కోట్లకు కొనుగోలు చేసింది. అనంతరం అంతకుమించిన ధరతో పంత్‌ను లక్నో సొంతం చేసుకుంది. లక్నో ఫ్రాంచైజీ మీపై అంత డబ్బు పెట్టింది కదా.. మరి మీపై ఏమైనా ఒత్తిడి ఉందా? అన్న ప్రశ్నకు పంత్ బదులిస్తూ గోయెంకాకు ఆందోళన లేనంత వరకు తనకూ ఉండదని పేర్కొన్నాడు. డబ్బు సంపాదించడం మంచిదే కానీ నిత్యం అదే పనిగా దాని గురించి ఆలోచించకూడదని పేర్కొన్నాడు.