Virat Kohli: 30న రైల్వేస్‌తో రంజీ మ్యాచ్‌లో ఢిల్లీ తరపున బరిలోకి కోహ్లీ

Virat Kohli to play Ranji match against railways on Jan 30
  • 13 ఏళ్ల తర్వాత రంజీల్లో ఆడబోతున్న కోహ్లీ 
  • ఈ నెల 30న రైల్వేస్‌తో చివరి మ్యాచ్‌లో బరిలోకి
  • మెడనొప్పి కారణంగా ఎల్లుండి సౌరాష్ట్రతో మ్యాచ్‌కు దూరం
  • దేశవాళీ బాటలో మరింతమంది టీమిండియా క్రికెటర్లు
వరుస వైఫల్యాలు, విమర్శలు, బీసీసీఐ ఆగ్రహం.. ఏదైతేనేం మొత్తానికి టీమిండియా ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. కోహ్లీ 13 సంవత్సరాల తర్వాత రంజీ బరిలో దిగుతున్నాడు. ఢిల్లీకి ప్రాతినిధ్యం వహించనున్న విరాట్ ఈ నెల 30న రైల్వేస్‌తో జరగనున్న చివరి లీగ్ మ్యాచ్‌లో బ్యాట్ పట్టనున్నాడు.

ఈ మ్యాచ్‌కు తాను అందుబాటులో ఉంటున్న విషయాన్ని కోహ్లీ ఇప్పటికే ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్‌కు తెలియజేశాడు. ఇక ఎల్లుండి (23న) ఢిల్లీ-సౌరాష్ట్ర మధ్య జరగనున్న మ్యాచ్‌లోనే కోహ్లీ ఆడాల్సి ఉండగా మెడనొప్పి కారణంగా అందుబాటులో ఉండటం లేదు. కాగా, రోహిత్‌శర్మ, జడేజా, రిషభ్‌పంత్, శుభమన్‌గిల్, యశస్వి జైస్వాల్ తదితర ఆటగాళ్లు కూడా రంజీల్లో ఆడేందుకు సిద్ధమవుతున్నారు.
Virat Kohli
Delhi
Ranji Trophy
Team India

More Telugu News