Chandrababu: రాజశేఖర్ రెడ్డి సర్కారు వచ్చినా నేను కట్టిన నిర్మాణాలు కూల్చలేదు: జ్యూరిచ్‌లో చంద్రబాబు

Chandrababu talks about Hyderabad in Zurich
  • హైదరాబాద్ అభివృద్ధిని తాను ముందే ఊహించానన్న చంద్రబాబు
  • మొదటిసారి ఐటీ గురించి నేనే మాట్లాడానన్న సీఎం
  • హైదరాబాద్ వల్లే తెలంగాణ తలసరి ఆదాయం పెరిగిందన్న ఏపీ సీఎం
స్విట్జర్లాండ్ లోని జ్యురిచ్‌లో పారిశ్రామికవేత్తలతో జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్ అభివృద్ధి గురించి మాట్లాడారు. హైదరాబాద్ అభివృద్ధిని తాను ముందే ఊహించానని తెలిపారు. మొదటిసారిగా తానే ఐటీ గురించి మాట్లాడానన్నారు. హైదరాబాద్‌లో భూములు అమ్మవద్దని చెప్పానని గుర్తు చేసుకున్నారు.

హైదరాబాద్ వల్ల దేశంలోనే తలసరి ఆదాయంలో తెలంగాణకు మొదటి స్థానం వచ్చిందన్నారు. ఉద్యోగాలు చేయడం కాదని.. ఇచ్చేస్థాయికి రావాలని తాను చెప్పేవాడినన్నారు. హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్ తీసుకురావడానికి తాను చాలా పోరాటం చేశానన్నారు. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం వచ్చినా హైదరాబాద్‌లో తాను కట్టిన నిర్మాణాలను కూల్చలేదన్నారు. నిరంతరం శ్రమించడం వల్లే తెలుగువాళ్లు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు.
Chandrababu
Hyderabad
Telangana
Andhra Pradesh

More Telugu News