నారా లోకేశ్ కు డిప్యూటీ సీఎం ఇవ్వాలంటూ డిమాండ్లు... టీడీపీ హైకమాండ్ కీలక ఆదేశాలు
- ఈ అంశంపై ఎవరూ మాట్లాడవద్దన్న పార్టీ అధిష్ఠానం
- బహిరంగ ప్రకటనలు చేయవద్దని ఆదేశం
- వ్యక్తిగత అభిప్రాయాలను వెల్లడించవద్దని సూచన
నారా లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్ల నేపథ్యంలో జనసేన వర్గీయుల నుంచి కౌంటర్ అటాక్ మొదలయింది. "లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేయండి... అందులో తప్పేమీ లేదు... పవన్ కల్యాణ్ ను సీఎం చేయండి" అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధిష్ఠానం సీరియస్ అయింది. అత్యుత్సాహం వద్దంటూ టీడీపీ నేతలకు సూచించింది.