K Kavitha: ప్రారంభోత్సవం తర్వాత మూతబడిన ఆ తలుపులు మళ్లీ తెరుచుకోలేదు: కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత విమర్శ

Kavitha fires at Congress government over Kaloji Kalakshetram
  • వరంగల్ నగర ప్రతిష్ఠను పెంచేందుకు కేసీఆర్ నిర్మించారన్న కవిత
  • కాళోజీ కళాక్షేత్ర నిర్మాణం తన ఘనతగా రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నారని విమర్శ
  • కాళోజీ కళాక్షేత్రాన్ని వినియోగంలోకి తీసుకు రావాలన్న కవిత
వరంగల్‌లో కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన కాళోజీ కళాక్షేత్రం తలుపులు ప్రారంభోత్సవం కోసం తెరుచుకున్నాయని, ఆ తర్వాత మూసిన తలుపులు మళ్లీ తెరుచుకోవడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆమె విమర్శలు గుప్పించారు. కాళోజీ కళాక్షేత్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించి చేతులు దులుపుకుందని విమర్శించారు. దీనిని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురాకపోవడాన్ని ఆమె తప్పుబట్టారు.

వరంగల్ నగర ప్రతిష్ఠను పెంచేందుకు కేసీఆర్ ప్రభుత్వం కాళోజీ క్షేత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిందన్నారు. కాళోజీ కళాక్షేత్రం తన ఘనతగా చిత్రీకరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. దీనిపై చూపించిన శ్రద్ధ... దానిని వినియోగంలోకి తీసుకు రావడంపై పెడితే బాగుంటుందన్నారు.
K Kavitha
BRS
Telangana
Revanth Reddy

More Telugu News