Kannappa: 'క‌న్న‌ప్ప' నుంచి 'లార్డ్ శివ' పోస్ట‌ర్ వ‌చ్చేసింది!

Akshay Kumar Lord Shiva First Look Poster Released From Kannappa Film

  • విషు మంచు, ముఖేశ్‌ కుమార్ సింగ్ కాంబోలో 'క‌న్న‌ప్ప‌' 
  • శివుడి పాత్ర‌లో అక్షయ్ కుమార్ 
  • తాజాగా ఆయ‌న తాలూకు పోస్టర్‌ను విడుద‌ల చేసిన మేక‌ర్స్‌
  • ఏప్రిల్ 25న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సినిమా

విషు మంచు ప్ర‌ధాన పాత్ర‌లో, ముఖేశ్‌ కుమార్ సింగ్ దర్శకత్వంలో వ‌స్తున్న‌ చిత్రం కన్నప్ప. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద మోహన్ బాబు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇక‌ ఈ సినిమాలో చాలా మంది స్టార్ హీరోలు నటిస్తున్న విష‌యం తెలిసిందే. 

అన్నీ ఇండస్ట్రీల నుంచి స్టార్లను తీసుకు వచ్చారు. బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్, మాలీవుడ్ నుంచి మోహన్ లాల్, టాలీవుడ్ నుంచి ప్రభాస్, కోలీవుడ్ నుంచి శరత్ కుమార్, ప్రభుదేవా వంటి వారిని ఈ ప్రాజెక్ట్ కోసం తీసుకు వచ్చారు. ఇప్పటికే ఈ సినిమాలో పలువురి పాత్రల పోస్టర్స్ రిలీజ్ చేశారు. 'కన్నప్ప' టీజర్ కూడా రిలీజ్ చేశారు. 

ఇక ఈ సినిమాలో శివుడి పాత్రలో నటిస్తున్న అక్షయ్ కుమార్ ఫస్ట్ లుక్ పోస్ట‌ర్‌ను తాజాగా విడుద‌ల చేశారు. ఈ పోస్టర్ లో శివుడి పాత్రలో అక్షయ్ కుమార్ త్రిశూలం, ఢమరుకం పట్టి నాట్యం చేస్తున్నట్టు ఉంది. పోస్టర్ పై 'ముల్లోకాలు ఏలే పరమశివుడు భక్తికి మాత్రం దాసుడు' అని రాశారు. 

కాగా, 'కన్నప్ప' సినిమాలో శివుడిగా అక్షయ్ కుమార్ నటిస్తుంటే.. పార్వతి దేవి పాత్రలో కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఆమె పార్వతి దేవి లుక్ ను కూడా విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. 

ప్రతీ సోమవారం ఈ చిత్రం నుంచి ఓ పోస్టర్ వస్తూనే ఉంది. అలా క్ర‌మం త‌ప్ప‌కుండా అప్‌డేట్‌ ఇస్తూ మేక‌ర్స్‌ కన్నప్ప సినిమాను జనాలకు దగ్గరగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను ఇప్ప‌టికే చిత్రం యూనిట్ ప్రారంభించింది. 

ఈక్రమంలోనే బెంగళూరు, చెన్నై అంటూ చిత్రబృందం తిరుగుతోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ వేస‌విలో ఏప్రిల్ 25న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానుంది.

View this post on Instagram

A post shared by Akshay Kumar (@akshaykumar)

  • Loading...

More Telugu News