Saif Ali Khan: సైఫ్ ఇంట్లో ఆ రాత్రి ఏం జరిగింది... వివరించిన ఆయా

What happened in Saif Ali Khan house as told by nanny Eliyama Philip

  • ఇటీవల బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి
  • తొలుత దుండగుడ్ని చూసింది సైఫ్ ఇంట ఆయా ఎలియామా ఫిలిప్
  • పోలీసుల దర్యాప్తులో వాంగ్మూలం ఇచ్చిన ఆయా 

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై కత్తిపోట్ల కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు... సైఫ్ ఇంట్లో పిల్లలను ఆడించే ఆయా ఎలియామా ఫిలిప్ (56) నుంచి కూడా స్టేట్ మెంట్ తీసుకున్నారు. ఆమె తన వాంగ్మూలంలో ఆసక్తికర అంశాలు వెల్లడించారు. ఈ రోజు రాత్రి ఏం జరిగిందో పూసగుచ్చినట్టు వివరించారు. 

"ఇంట్లోకి చొరబడిన వ్యక్తిని మొదటగా చూసింది నేనే. అర్ధరాత్రి తర్వాత బాత్రూం వద్ద అలికిడి అయితే, కరీనా కపూర్ ఏమో అనుకున్నాను. దాంతో మళ్లీ నిద్రపోయాను. కొంచెం సేపటి తర్వాత మళ్లీ శబ్దం వచ్చింది. ఏదో జరుగుతోందని అనుమానం వచ్చింది. అప్పుడు సమయం 2 గంటలు అనుకుంటా. బాత్రూం నుంచి ఓ వ్యక్తి బయటికి వస్తూ కనిపించాడు. అతడు సైఫ్ కుమారుడు జెహ్ ఉన్న గదిలోకి వెళ్లడం చూశాను. దాంతో నేను కూడా పరుగుపరుగున ఆ గదిలోకి వెళ్లాను. 

నన్ను చూసిన ఆ వ్యక్తి... నోటిపై వేలు ఉంచుకుని "అరవొద్దు... ఎవరూ బయటికి వెళ్లొద్దు" అని హిందీలో చెప్పాడు. అతడి చేతిలో ఓ కర్ర, కత్తి వంటి ఆయుధం ఉన్నాయి. అయినప్పటికీ నేను ముందుకు అడుగేసి చిన్నారి జెహ్ ను చేతుల్లోకి తీసుకునేందుకు ప్రయత్నించాను. అతడు నాపై దాడికి దిగాడు. నేను చేతులు అడ్డుపెట్టడంతో నా రెండు చేతులకు గాయాలయ్యాయి. 

దాంతో... నీకేం కావాలి? అని అతడ్ని ప్రశ్నించాను. నాకు కోటి రూపాయలు కావాలి అని అతడు ఇంగ్లీషులో బదులిచ్చాడు. ఇంతలో నా కేకలు విని సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ కూడా ఆ గదిలోకి వచ్చారు. ఎవరు నువ్వు, ఏం కావాలి అంటూ సైఫ్ ఆ వ్యక్తిని ప్రశ్నించారు. దాంతో ఆ వ్యక్తి... సైఫ్ పై కర్రతో, కత్తితో దాడి చేశాడు. సైఫ్ సార్... ఎలాగో అతడి నుంచి తప్పించుకుని ఆ గది బయటికి పరుగెత్తి ఆ గది తలుపులు వేసేశారు. ఆ తర్వాత మేం అందరం ఆ ఇంటి పై ఫ్లోర్ లోకి పరుగెత్తాం. కాసేపటికి ఆ వ్యక్తి పారిపోయాడు" అని ఎలియామా ఫిలిప్ వెల్లడించారు.

Saif Ali Khan
Attack
Nanny
Mumbai
Bollywood
  • Loading...

More Telugu News