RG Kar Incident: నా కుమారుడికి మరణశిక్షే సరైనది: ఆర్జీ కర్ ఘటన దోషి సంజయ్ రాయ్ తల్లి

RG Kar convict Sanjay Roy mother comments on final verdict

  • గతేడాది కోల్ కతా ఆర్జీ కర్ ఆసుపత్రిలో దారుణం
  • ట్రైనీ డాక్టర్ పై హత్యాచారం
  • నిందితుడు సంజయ్ రాయ్ ని దోషిగా తేల్చిన కోర్టు
  • రేపు శిక్ష ఖరారు చేయనున్న న్యాయస్థానం
  • అతడికి మరణశిక్ష విధించినా అభ్యంతరం చెప్పబోమన్న తల్లి 

ఆర్జీ కర్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్ పై హత్యాచార ఘటనలో నిందితుడు సంజయ్ రాయ్ ని కోల్ కతా కోర్టు దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే. అతడికి న్యాయస్థానం రేపు (జనవరి 20) శిక్ష ఖరారు చేయనుంది. ఈ నేపథ్యంలో, సంజయ్ రాయ్ తల్లి స్పందించారు. 

తన కుమారుడికి మరణశిక్ష విధించడమే సరైన చర్య అని వ్యాఖ్యానించారు. తనకు ముగ్గురు కుమార్తెలు కూడా ఉన్నారని, ఆ ట్రైనీ డాక్టర్ పట్ల తన కుమారుడు ప్రవర్తించిన తీరును ఓ తల్లిగా ఎప్పటికీ క్షమించలేనని అన్నారు. కుమార్తెకు ఇటువంటి పరిస్థితి వస్తే ఆ తల్లి పడే వేదనను ఓ స్త్రీగా తాను అర్థం చేసుకోగలనని అన్నారు.

మరణించిన ఆ జూనియర్ డాక్టర్ ను కూడా తన కుమార్తెలాగే భావిస్తానని పేర్కొన్నారు. సంజయ్ కి మరణశిక్ష విధించినా తాము ఎలాంటి అభ్యంతరం చెప్పబోమని, కాకపోతే, కొడుకు చనిపోయినందుకు కన్నీళ్లు పెడతానేమో అని వ్యాఖ్యానించారు.  


RG Kar Incident
Sanjay Roy
Mother
Kolkata
  • Loading...

More Telugu News