Donald Trump: అమెరికా అధ్యక్ష బాధ్యతల తర్వాత భారత్‌లో డొనాల్డ్ ట్రంప్ పర్యటన?

Donald Trump India visit PM Modi White House invite likely soon
  • మరికొన్ని గంటల్లో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం
  • భారత్ పర్యటనపై సలహాదారులతో చర్చించిన ట్రంప్
  • ఆ తర్వాత చైనాలోనూ ట్రంప్ పర్యటించే అవకాశం
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా మరికొన్ని గంటల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బాధ్యతల స్వీకరణ అనంతరం ట్రంప్ భారత్‌లో పర్యటించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. చైనాలోనూ ట్రంప్ పర్యటించే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు ఇంగ్లీష్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

తాను అధికారం చేపట్టాక చైనా దిగుమతులపై సుంకాలు విధిస్తానని ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలో బీజింగ్‌తో తన సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ఆయన ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగా బాధ్యతల స్వీకరణ అనంతరం చైనాలో పర్యటించనున్నారని తెలుస్తోంది.

భారత్‍‌లో పర్యటించే అంశంపై ట్రంప్ సలహాదారులతో చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో త్వరలో వైట్ హౌస్‌లో జరగనున్న దేశాధినేతల సమావేశానికి భారత ప్రధాని మోదీని ట్రంప్ ఆహ్వానించనున్నారు. ఈ సమావేశం తర్వాత ట్రంప్ భారత పర్యటన ఉండనుందని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
Donald Trump
USA
India
China

More Telugu News