పాకిస్థానీ మహిళ సీమా హైదర్ వ్యవహారంలో మరో మలుపు
- పిల్లల కోసం భారత ప్రభుత్వానికి సీమా మొదటి భర్త విజ్ఞప్తి
- యూపీ యువకుడి కోసం పిల్లలతో సహా భారత్ వచ్చిన సీమా
- పెళ్లి చేసుకుని గ్రేటర్ నోయిడాలో భర్త, పిల్లలతో కలిసి కాపురం
ఆన్ లైన్ లో పరిచయమైన యువకుడి కోసం సరిహద్దులు దాటి వచ్చేసిన పాకిస్థానీ మహిళ సీమా హైదర్ గ్రేటర్ నోయిడాలో సెటిలైన విషయం తెలిసిందే. యూపీ యువకుడు సచిన్ మీనాను పెళ్లి చేసుకుని తన పిల్లలతో కలిసి కాపురం పెట్టింది. 2023లో జరిగిన ఈ ఘటన రెండు దేశాల్లో సంచలనం సృష్టించింది. తాజాగా ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. తన పిల్లలను తనకు అప్పగించాలంటూ సీమా హైదర్ మొదటి భర్త గులామ్ భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాడు.
సీమా హైదర్ కు తనకు నలుగురు పిల్లలు కలిగారని, ఆమె పిల్లలను తీసుకుని భారత్ వచ్చేసిందని ఆయన చెప్పారు. పిల్లల అప్పగింత కోసం పాకిస్థానీ మానవ హక్కుల న్యాయవాదిని గులామ్ ఆశ్రయించాడు. న్యాయవాదితో కలిసి భారత్ కు చెందిన మరో లాయర్ సహకారంతో న్యాయస్థానం ద్వారా తన పిల్లలను వెనక్కి రప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు గులామ్ వివరించాడు.