Telugudesam: వైసీపీ నుంచి వచ్చిన వారికి పదవులు ఇస్తే ఎలా?: కర్నూలు జిల్లా టీడీపీ నేత
- పార్టీ కోసం జైళ్లకు పోయినోళ్లు, ఆర్థికంగా నష్టపోయినోళ్లు ఉన్నారన్న తిక్కారెడ్డి
- ఈ క్రమంలో వైసీపీ నుంచి వచ్చిన వారికి పదవులు ఇస్తే ఊరుకునేది లేదని స్పష్టీకరణ
- సొంత కార్యకర్తల నుంచి లంచాలు తీసుకుంటున్నారని ఆరోపణ
పార్టీ కోసం జైళ్ళకు పోయినవాళ్లు, రోడ్లపైకి వచ్చిన ధర్నా చేసినవాళ్లు, ఆర్థికంగా నష్టపోయినవాళ్లు అక్కడే ఉన్నారని, ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ నుంచి వచ్చిన వారికి పదవులు ఇస్తే ఊరుకునేది లేదని కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డి హెచ్చరించారు. జగన్ హయాంలో మన కార్యకర్తలకు అన్యాయం చేసి... ఇప్పుడు వైసీపీ నుంచి మన పార్టీలోకి వచ్చిన వారికి పదవులు ఇవ్వవద్దన్నారు.
శనివారం ఆయన కర్నూలులో మీడియాతో మాట్లాడారు. ఇక్కడ కొంతమంది సొంత పార్టీ కార్యకర్తల నుంచి లంచాలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేలు, పార్టీ ఇంఛార్జ్‌ల పేర్లు చెప్పి కొందరు వ్యక్తులు టీడీపీ కార్యకర్తల వద్ద డీలర్ దుకాణం పేరుతో రూ.5 లక్షల వరకు వసూలు చేస్తున్నారని, ఇది సరికాదన్నారు. కర్నూలులో జరిగే అక్రమాలు, ముడుపుల వ్యవహారాన్ని సీఎం దృష్టికి తీసుకువెళతామన్నారు.